: పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలి: ప్రధాని


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే సమావేశాలకు హుందాతనం వస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి 30 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. సమావేశం అనంతరం మన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆహార భద్రత, లెజిస్లేటివ్ బిజినెస్, ఇంకా పలు బిల్లులపై సమావేశాల్లో బిల్లులుగా రూపొందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పార్లమెంటు సమావేశాలు సరిగా జరగలేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News