: యూపీ ఇసుక మాఫియాపై ప్రధానికి సోనియా లేఖ


వారం రోజుల నుంచి ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టిస్తున్న ఇసుక మాఫియా వ్యవహారంపై ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. యూపీ ఇసుకు మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ ఆఫీసర్ దుర్గా శక్తి నాగపాల్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఓ రాష్ట్ర ప్రభుత్వం, ఐఏఎస్ అధికారిణి మధ్య జరిగిన ఈ విషయంపై కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాబట్టి, ఈ కేసులో జోక్యం చేసుకుని ఆమెకు ఎలా సహాయపడగలమో చూడాలని కోరారు. ఐఏఎస్ అధికారిణి అన్యాయంగా బలికావడం సహించదగనిదని సోనియా చెప్పారు.

  • Loading...

More Telugu News