: సమైక్యాంధ్రకు మద్దతుగా కేబుల్ ప్రసారాల నిలిపివేత


సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆందోళనలు ఉధృత రూపం దాల్చుతున్నాయి. ఉధ్యమానికి మద్దతుగా కేబుల్ ఆపరేటర్లు మండపేట, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, గోకవరంలో వినోదాత్మక కేబుల్ ప్రసారాలు నిలిపివేశారు. అనంతరం దేవీ చౌక్ వద్ద నన్నయ్య యూనివర్సిటీ విద్యార్ధులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహారంగా నిలబడ్డారు. మరో వైపు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆదివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉభయగోదావరి జిల్లాల న్యాయవాదుల జేఏసీ భేటీ కానుంది. ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండడంతో కోస్తా ఐజీ ద్వారకా తిరుమలరావు సమైక్యవాదులను సంయమనం పాటించాలని కోరారు.

  • Loading...

More Telugu News