: సారీ.. ఎక్కువమంది డాక్టర్లకు ఎంబీబీఎస్ డిగ్రీల్లేవు!
వారు వైద్యులే.. దర్జాగా అల్లోపతి మందులను రాసి పారేస్తుంటారు. కానీ, వారికి ఆ అర్హతే లేదు. ఇంతకీ వారు చదివింది... ఆయుర్వేదం, హోమియో, యునాని, ప్రకృతి, సిద్ధ.. ఇలాంటి వైద్య విద్య పట్టాలతో, అల్లోపతి మందులతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాస్తవానికి ఎంబీబీఎస్ చదవాలంటే మిగతా ప్రత్యామ్నాయ వైద్య డిగ్రీల కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి. దీంతో, ఏదో ఒక వైద్య విద్య చదవడం.. అల్లోపతి వైద్యం చేయడం అలవాటైపోయింది. వాస్తవానికి ఎవరు ఏ విభాగంలో వైద్య విద్యను అభ్యసిస్తే.. ఆ మెడిసిన్ లోనే వైద్య సేవలు అందించాలి. కానీ, మనలాంటి దేశంలో అలా చెల్లిపోతోంది. దేశవ్యాప్తంగా 120 పట్టణాలలో ఇలా ప్రత్యామ్నాయ వైద్య డిగ్రీలు ఉండి, ఇంగ్లిష్ వైద్యం చేస్తున్న వైద్యులు 4 లక్షల మంది వరకూ ఉన్నారని ఐఎంఎస్ వెల్లడించింది. ఇలాంటి అక్రమ విధానాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారతీయ వైద్య మండలి కోరుతోంది.