: ఆంద్రా నటులను నేనేం అనలేదు : దర్శకుడు ఎన్.శంకర్
'ఇకపై తెలంగాణలో ఆంధ్రాకు చెందిన సినిమా వాళ్ల ఆటలు సాగవు' అంటూ తెలంగాణ ప్రకటన అనంతరం తాను వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఖండించాడు. కొన్ని పత్రికల్లో, వెబ్ సైట్లలో వచ్చిన ఈ వార్తలకు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నట్లు తెలిపాడు. ఆంద్రా నటులపై అలాంటి వ్యాఖ్యలేమి చేయలేదన్నాడు. తనపై లేనిపోని వ్యతిరేక వార్తలు రాయవద్దని వేడుకున్నాడు. తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నాడు. తాను అందరివాడినని, ఇరు ప్రాంతాల్లో తనకు కావలసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇలా తనను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదని వివరణ ఇచ్చుకున్నాడు.