: టాస్ గెలిచిన టీమిండియా
భారత జట్టు జింబాబ్వే పర్యటన ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే నాలుగు వన్డేలు ఆడిన టీమిండియా దిగ్విజయంగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుని సత్తా చాటింది. చివరి వన్డే మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. చివరి వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా మరోసారి అచ్చొచ్చిన గేమ్ ప్లాన్ అమలు చేయాలని తలపోస్తోంది. జింబాబ్వే ను ముందు బ్యాటింగ్ కు ఆహ్వానించి తక్కువ స్కోరుకే కట్టడి చేసి వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్నది కోహ్లీ ప్లాన్. మరోవైపు, జింబాబ్వే చివరి మ్యాచ్ నైనా గెలుచుకుని పరువు నిలుపుకోవాలని ఆశపడుతోంది.