: పరిశోధనల కారణంగా 436 మంది బలి


భారత్ లో కొత్త పరిశోధనలు, కొత్త మందులు పురుడు పోసుకోవాలంటే వందల మంది ప్రాణాలు బలవుతున్నాయి. ఇందులో భాగంగా 2012 లో మనదేశంలో మందులను పరీక్షించడానికి మనుషులపై జరిపిన ప్రయోగాలకు 436 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర సర్కార్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే, ఈ మరణాలు పూర్తిగా ప్రయోగాల కారణంగా జరిగినవేనా? అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గురువారం పార్లమెంటు సమావేశాల్లో లోక్ సభకు ఇచ్చిన ఓ లిఖిత పూర్వక సమాధానంలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. కాగా, 2011లో ఈ సంఖ్య 438 ఉందని, 2010లో 668 ఉందని వివరించారు. 

  • Loading...

More Telugu News