: రోడ్లపై పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు.. వినూత్న నిరసన


రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడం పట్ల సీమాంధ్ర ప్రాంతాల్లో నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు తమ వ్యతిరేకతను విభిన్న తరహాలో వ్యక్తీకరించారు. రోడ్లపై విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలను బోధించారు. ఈ నిరసన కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహీత బొమ్మిడి నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఇంతకుముందులాగే కలిపి ఉంచాలని కోరారు.

  • Loading...

More Telugu News