: కేసీఆర్... నీ వ్యాఖ్యలతో తెలంగాణను అడ్డుకుంటున్నావ్: దానం


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. తెలంగాణ ఆగిపోతే అందుకు కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. విజయనగరం నుంచి వలస వచ్చిన కేసీఆరే, హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోవాలన్నారు. ఆంధ్ర ఉద్యోగులకు ఆప్షన్లు ఉండవంటూ, తెలంగాణను విడిచిపెట్టి తమ ప్రాంతానికి వెళ్లాలని, అక్కడ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News