: 20 నిమిషాల నడకతో మతిమరుపు దూరం


ప్రతిరోజూ 20 నిమిషాల పాటూ నడక వ్యాయామం అనేది డెమెన్షియాను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేవలం జ్ఞాపకశక్తిని పెంచడం మాత్రమే కాదు.. మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తుందిట.

సాధారణంగా డెమెన్షియాకు చికిత్స లేదని అంటూ ఉంటారు. అయితే యూకేలో అల్జీమర్స్‌ వ్యాధికి సంబంధించి పరిశోదనలు చేస్తున్న డాక్టర్‌ లారా ఫిలిప్స్‌ తన అధ్యయనం ద్వారా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగతాగకుండా ఉండడం, బీపీ, షుగర్‌లను నిత్యం చెక్‌ చేసుకుంటూ ఉండడం అనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెమెన్షియాను నియంత్రించవచ్చునని చెబుతున్నారు.

వ్యాయామాలకు సంబంధించిన ఓ కార్యక్రమంలో 60 నుంచి 88 ఏళ్ల వయస్సు ఉన్న వారిని అధ్యయనం చేశారు. వారిలో నడక వ్యాయామం చేస్తున్న ఎక్కువ మందిలో.. మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లుగా పేర్కొన్నారుట.

  • Loading...

More Telugu News