: పని సరిగా చేయకుంటే... బట్టలు విప్పిస్తారక్కడ


మీరు సరిగా పనిచేయకుంటే మీ యజమాని ఏం చేస్తాడు? మహా అయితే.. మందలిస్తారు. కోప్పడతారు. మెమో లేదా షోకాజు కూడా ఇస్తారు. కానీ చైనా దేశంలో పరిస్థితి వేరు. దేశం మొత్తం అలాగే ఉంటుందని చెప్పలేం గానీ.. అక్కడ ఏకంగా బట్టలు విప్పించి రోడ్డు మీద ప్రదర్శనగా తిప్పుతారు.

దక్షిణ చైనాలోని ఫోషాన్‌ నగరంలో ఓ ఫిట్‌నెస్‌ క్లబ్‌లో సేల్స్‌ ప్రతినిధులుగా పనిచేసే కుర్రాళ్లు.. విక్రయాల్లో తమ లక్ష్యం చేరుకోలేకపోయారు. దాంతో యజమాని వారిని అండర్‌ వేర్‌ తప్ప మిగిలిన బట్టలన్నీ విప్పించి.. రోడ్దుమీద గుంపుగా నడవాల్సిందిగా పురమాయించాట్ట. దాంతో వాళ్ళని చూసే వాళ్లు విస్తుపోయేలా.. రోడ్డుమీద ఇలా దేహప్రదర్శన చేస్తూ నడిచి వెళ్లారట. ఇదేం నియంతృత్వం అనుకుంటున్నారా...? అయినా సదరు శిక్షపడిన వారిలో అమ్మాయిలు లేకపోవడం వారి అదృష్టం.

  • Loading...

More Telugu News