: ఏం చేద్దాం?.. బీజేపీ సీమాంధ్ర నేతల సమాలోచనలు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాయలసీమ ప్రాంత నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తు ఉద్యమంపై బీజేపీ రాయలసీమ ప్రాంత నేతలు చర్చిస్తున్నారు. బీజేపీ ప్రకటనతోనే రాష్ట్ర విభజన జరిగిందంటూ, ఆందోళనకారులు రాయలసీమ ప్రాంతంలో బీజేపీ కార్యాలయాలకు నిప్పు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ బీజేపీ నేతలు ప్రజాగ్రహం చవిచూసేలా ఉన్నారు. దీంతో, బీజేపీ నేతలంతా గుండెల్ని గుప్పెట్లో పెట్టుకుని ప్రజల్లోకి రావడానికే భయపడుతున్నారు.