: హవ్వ.. రాజకీయ పార్టీలకు మినహాయింపా: జయప్రకాశ్ నారాయణ
రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురాకూడదన్న నిర్ణయం సరైంది కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అభిప్రాయపడ్డారు. స్వచ్ఛంద సంస్థలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చి, రాజకీయ పార్టీలను మినహాయించడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజాధనంతోనే నడిచేటప్పుడు ఎందుకు ఆర్టీఐ పరిధిలోకి రావని ఆయన ప్రశ్నించారు. కేవలం పదవులు ఉన్నాయని రాజకీయ నాయకులు అరాచకాలకు పాల్పడుతుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని జేపీ అభిప్రాయపడ్డారు.