: సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ర్యాలీ


సమైక్య చిచ్చు సచివాలయాన్నీ వదల్లేదు. తమ హక్కులు కాపాడాలంటూ సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఇక్కడ భాగస్వాములమయ్యామని, అలాంటిది ఇప్పడు ఒక్కసారిగా రాత్రికి రాత్రి ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఇప్పటికే తెలుగుతల్లి విగ్రహానికి నష్టం చేకూర్చేవారు ఉన్నారంటూ, ఆ విగ్రహాలను ఎలా పరిరక్షిస్తారని అడుగుతున్నారు. తమ భావితరాల భవిష్యత్ కు భరోసా ఏదని మండిపడుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఉన్నపళంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని వీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News