: నటి తమన్నాకు సమైక్య సెగ
సినీనటి తమన్నాకు సమైక్యాంధ్ర సెగ తాకింది. విశాఖలో ఓ చిత్రం షూటింగు కోసం వచ్చిన తమన్నా తిరిగి హైదరాబాదు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వెళుతున్న సమయంలో ఆమె కారును ఉద్యమకారులు చుట్టుముట్టారు. 'జై సమైక్యాంధ్ర' అని చెప్పాలంటూ ఆందోళనకారులు ఒత్తిడి చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి షాక్ కు గురయిన తమ్మూ.. 'ప్లీజ్ అర్ధం చేసుకోండి. నేను సినిమా తారను. నాకు దీనికి సంబంధంలేదు. నేను ఇండియన్ ను. నాకు అందరూ కావాలి' అని చెప్పింది. అయినా, ఉద్యమకారులు వెనక్కుతగ్గలేదు. దాంతో, కొంతసేపు ఇరువురి మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి అందరినీ అడ్డు తొలగించడంతో తమన్నా వెళ్లిపోయింది.