: ఉత్తర భారతంలో భూకంపం
ఉత్తర భారతదేశంలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, చండీగఢ్, హర్యానా రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో వచ్చిన ఈ ప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం జమ్మూకాశ్మీర్లోని దోడాలో ఉన్నట్లు వెల్లడించారు.