: నిశాచరి అయిన కొత్తజాతి సాలీడు


జర్మనీలోని ఓ పరిశోధకుడు వేర్వేరు పరిశోధనలు చేస్తున్న సమయంలో యాదృచ్ఛికంగా ఒక కొత్త ప్రాణిని గమనించి.. దాని గురించి పరిశోధించి.. అది ఒక్క కొత్త జాతి సాలీడు అని కనుగొన్నారు. మనకు బోలెడు రకరకాల సాలీడులు ఇళ్లలో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అడవుల్లో అతి భయంకరమైన విషపు సాలీడులు కూడా ఉంటాయి. సాధారణంగా సాలీడులు తమ ఆహారాన్ని సాలెగూటిలో బంధించి.. తర్వాత తింటాయి. కానీ జర్మనీలో కనుగొన్న ఈ కొత్త జాతి సాలీడు రాత్రిళ్లు మాత్రమే తిరుగుతుంది. తనకు నచ్చిన పురుగులను కుట్టి తినేస్తుంది.

ఇదెలా కనుగొన్నారంటే.. జర్మనీలోని సెంకన్‌బర్గ్‌ పరిశోధన సంస్థకు చెందిన పీటర్‌ జగ్వర్‌ లావోస్‌ లో ప్రకృతి అందాలను చిత్రిస్తుండగా.. ఒక కొత్త జీవి కంటపడిరది. మరింత అధ్యయనం చేస్తే అది కొత్త జాతి సాలీడు అని అర్థమైంది. ఇది ఒక సెంటీమీటరు పొడవు మాత్రమే ఉంటుందిట.

  • Loading...

More Telugu News