: కేవీపీ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ
ఢిల్లీలోని కేవీపీ రామచంద్రరావు నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్రమంత్రులు సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ఎంపీలు ఉండవల్లి, లగడపాటి, కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్,హర్షకుమార్ హాజరయ్యారు. వీరితో పాటు సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు పల్లంరాజు, పురందేశ్వరి, కిల్లి కృపారాణి, జేడీ శీలం హాజరయ్యారు.కాగా కావూరి సాంబశివరావు, చిరంజీవి, పనబాక లక్ష్మి, కిశోర్ చంద్రదేవ్, కోట్ల ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వీరంతా భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చిస్తునట్టు సమాచారం. రాజీనామాల యోచనలో పలువురు ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది.