: ముఖ్యమంత్రితో సమావేశమైన సీమాంధ్ర మంత్రులు
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్రకు చెందిన మంత్రులు సమావేశమయ్యారు. వీరిలో బొత్స, కాసు కృష్ణారెడ్డి, మహీధర్ రెడ్డి, శత్రుచర్ల, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గల్లా అరుణకుమారి, వట్టి వసంతకుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై వీరు చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటని ఆలోచనలో పడ్డట్టు సమాచారం.