: ఆసక్తికరంగా యాషెస్ మూడో టెస్టు ఆసీస్ 135/3


యాషెస్ మూడోటెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు మరోసారి తమ సత్తా చూపేందుకు సిద్దమవగా, ఎలాగైనా ఈ టెస్టు గెలిచి బోణీ చేయాల్సిందేనని ఆస్ట్రేలియా కృత నిశ్చయంతో ఉంది. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ తొలి రోజు గత రెండు టెస్టుల కంటే ప్రతిభావంతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఎప్పట్లాగే షేన్ వాట్సన్(14) నిరాశపరిస్తే అతని జతగాడు రోజర్స్ 84 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వాట్సన్ తరువాత వచ్చిన ఖ్వాజా(1) కూడా నిరాశపరచడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ క్లార్క్(46) కుదురుకున్నాడు. అతనికి జతగా స్మిత్ ఆడుతున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్(2), బ్రెస్నన్(1) రాణించారు.

  • Loading...

More Telugu News