: స్నోడెర్న్ ఎక్కడ తలదాచుకున్నాడు?
ప్రజా వేగు, స్వేచ్ఛా ఉద్యమకారుడు, ఇంటర్నెట్ పై అమెరికా నిఘాను బయటపెట్టిన ఎడ్వర్డ్ స్నోడెర్న్ రష్యా రాజధాని మాస్కో విమానాశ్రయం ట్రాన్సిట్ జోన్ నుంచి వెళ్లిపోయారు. అమెరికా ఆగ్రహానికి గురైన ఆయన రష్యాకు పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే, ఆశ్రయం కోరుతూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనపై రష్యా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలోని అగ్రరాజ్యాన్ని ధిక్కరించే కొన్ని దేశాలు స్నోడెర్న్ కు స్వాగతం పలికిన నేపథ్యంలో ఆయా దేశాలకు ఆయన రహస్యంగా వెళ్లిపోయి ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరి కొందరు రష్యాయే ఆయనను రహస్యప్రదేశంలో దాచి ఉంచే అవకాశమూ లేకపోలేదని అంటున్నారు.