: కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న కొండా దంపతులు!
వైస్సార్సీపీకి రాంరాం చెప్పిన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరూ శనివారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ను కలవనున్నారని సమాచారం. 2009లో వైఎస్ హఠాన్మరణంతో మంత్రి పదవిని వదులుకున్న సురేఖ కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చారు. కొన్నిరోజుల కిందట వరకు వైఎస్సార్సీపీకి చెందిన కొంతమంది నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామా చేయడాన్ని కొండా దంపతులు వ్యతిరేకించారు. తమకు చెప్పకుండా ఇలా చేయడం సరికాదంటూ, పార్టీ కూడా తమకు స్పష్టతనివ్వలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సాక్షిగా ప్రకటించారు.