: కామాంధుడీ అధ్యాపకుడు


అధ్యాపకుడు స్టాన్లీ సురేష్ విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇవాళ తరగతులు బహిష్కరించిన విద్యార్థులు స్టాన్లీ దిష్ఠి బొమ్మ ఊరేగించారు. స్టాన్లీ వేధింపులకు తాళలేకపోతున్నామంటూ ఎందరో విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ద్వంద్వార్థాలు వచ్చేట్టు మాట్లాడుతూ పైశాచికానందం పొందుతాడని అంటున్నారు. అలాగే తనకు అనుకూలంగా నడుచుకోవాలని విద్యార్థినీ, విద్యార్థులను వేధింపులను గురిచేస్తున్నాడని ఆరోపించారు. పలుమార్లు పై అధికారులకు, వీసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఆయనను ఉద్యోగం నుంచి తొలగించేవరకు తాము ఆందోళన విరమించేదిలేదని విద్యార్థులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News