: దాడులకు కొన్ని గంటల ముందే రాష్ట్రాన్ని అప్రమత్తం చేశాం: కేంద్రం
తీవ్రవాద దాడుల ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతోంది! హైదరాబాద్ పోలీసులను నిన్న ఉదయమే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ తాజాగా ప్రకటించింది. కేంద్రం సమాచారం అందించిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్ లో వరుస పేలుళ్లు సంభవించడం రాష్ట్ర ప్రభుత్వ అలసత్వానికి అద్దం పడుతోంది. పాక్ ఉగ్రవాదులు హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూరు, హుబ్లీ వంటి నగరాల్లో దాడులకు తెగబడవచ్చని తాము ముందుగానే ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేశామని కేంద్రం స్పష్ఠం చేసింది.