: బొత్స నివాసం ముట్టడి
సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. సీమాంధ్ర మొత్తం విభజన ప్రకటన తదనంతర పరిణామాలతో అట్టుడుకుతోంది. విజయనగరం జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసాన్ని ముట్టడించేందుకు సమైక్యవాదులు ప్రయత్నించారు. దీంతో, భారీగా పోలీసులు బొత్స నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు.