: తెలంగాణ ప్రాజెక్టుల్లోకి జల సిరులు


తెలంగాణ ప్రాంతంలో భారీవర్షాల కారణంగా దాదాపు అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది. నాగార్జున సాగర్ లోకి 4.72లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 17వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 540 అడుగులకు చేరుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 2.88 క్యూసెక్కులు వస్తుండగా.. 2.91 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1.25 క్యూసెక్కుల వరదనీరు వస్తుంటే.. గేట్లన్నీ ఎత్తివేసి అంతే మొత్తం పరిమాణంలో దిగువకు విడిచి పెడుతున్నారు. ప్రస్తుత నీటి మట్టం 1091 అడుగులుగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా కొమరంభీమ్ ప్రాజెక్టులోకి 13,500 క్యూసెక్కుల నీరు వస్తుంటే, 20,200 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు.

  • Loading...

More Telugu News