: తాతయ్య ఆరోగ్యం టెన్షనా.. ట్యాబ్లెట్ గిఫ్టివ్వండి
తాతయ్య, అమ్మమ్మ ల ఆరోగ్య పరిస్థితులను దగ్గరుండి చూసుకోలేకపోతున్నామే.. అనే టెన్షన్ మీలో ఎప్పుడైనా కలుగుతూ ఉంటుందా? మంచి పనిలో ఉండగా.. ఇప్పుడు నానమ్మ ఆరోగ్యం ఎలా ఉందో అనే చింత వేధిస్తుంటుందా? జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసమే అయితే చింత అక్కర్లేదు. ఎంచక్కా ఓ ట్యాబ్లెట్ కొని.. వారికి గిఫ్టుగా సమర్పించుకుంటే చాలు. వారికి సంబంధించిన ఆరోగ్య, పరిస్థితుల వివరాలు ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇలా వయస్సు మళ్లిన వృద్ధులకు బాగా ఉపయోగపడడానికి ఓ ప్రత్యేకమైన ట్యాబ్లెట్ను వాంకోవర్కు చెందిన ఒక కంపెనీ రూపొందించింది.
క్లారిస్ కంపానియన్ పేరిట దీన్ని రూపొందించారు. పైగా దీనిని వృద్ధులు సులభంగా వాడుకునేలా తీర్చిదిద్దారు. వారి ఆరోగ్య పరిస్థితి, ఔషధ సేవనం, చికిత్సలకు సంబంధించిన సమాచారంను దీనిద్వారా అనుసంధానం అయిన వ్యక్తులు కూడా తెలసుకోవచ్చునట. పైగా మామూలు ట్యాబ్లెట్ లాగా మెసేజీలు, ఈమెయిళ్లు కూడా దీని ద్వారా సాధ్యమే!