: ఒబేసిటీ బెడద కలిగించని జంక్‌ఫుడ్‌


జంక్‌ఫుడ్‌ అనగానే చవులూరని వ్యక్తులు చాలా తక్కువగానే ఉంటారు. నోరు లొట్టలు వేస్తుంది గానీ.. ఒబేసిటీ సమస్యలు ఉంటాయని, జంక్‌ఫుడ్‌ వలన ఆరోగ్యం మందగిస్తుందని మనసు ఆందోళన చెందుతూ ఉంటుంది. అలా.. నోటికి మనసుకు ఒక పోరాటం నడుస్తుంటుంది.. జంక్‌ఫుడ్‌, రెడీమేడ్‌ ఫుడ్‌ విషయంలో. అయితే ఎలాంటి టెన్షన్ల అవసరం లేకుండా విచ్చలవిడిగా జంక్‌ఫుడ్‌ తీసుకునేలా జర్మనీలోని ఓ ఆహార పరిశోధన సంస్థ కొత్త టెక్నాలజీని తయారుచేసిందిట.

రెడీమేడ్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌ వల్ల ఒబేసిటీ, హైబీపీ, టైప్‌2 మధుమేహం వంటి సమస్యలు వస్తాయని సాధారణంగా అనుకుంటూ ఉంటారు. అయితే వీటికి కారణం అయ్యే తీపి, ఉప్పు, కొవ్వు పదార్థాలను అదనంగా వాడకుండా.. వీటిని తయారుచేసే పరిజ్ఞానం ఒకటి రూపొందింది. ఆహారంలో మాత్రం సేంటుసేం రుచి వస్తుందిట.

ఆహారాన్ని పులియబెట్టి, నిల్వ చేసే స్థితిలో కొన్ని మార్పుల వలన ఈ ఫలితం సాధిస్తున్నారట. సమస్యలు ఉత్పన్నం చేయని పూర్తిస్థాయి రెడీమేడ్‌ ఫుడ్‌ను త్వరలో రూపొందిస్తామని పరిశోధకుడు మాథ్యూస్‌ కుక్‌ తెలిపారు. రుచిలో తేడా ఉండదు గానీ.. మామూలు జంక్‌ఫుడ్‌ కంటె.. వీటిలో ప్రమాదకరమైన తీపి, కొవ్వు వంటివి 30 శాతం తక్కువ ఉంటాయిట.

  • Loading...

More Telugu News