: చెవులు కొరుక్కున్నారా.. కొత్త చెవి సిద్ధం


చెవులు కొరుక్కోవడం అనేది మన వ్యవహారంలో చాలా సహజమైన పరిణామం. ‘చెవులు కొరుక్కోవడం’ అనే పదానికి మన భాషలో వేరే అర్థం ఉన్నది గానీ.. ఒకవేళ ఎవరైనా పొరబాట్న మీ చెవిని నిజంగా కొరికేసినా కూడా పెద్దగా దిగులూ, విచారమూ అక్కర్లేదు. కాకపోతే కొంచెం ఖర్చవుతుందంతే.

ప్రమాదంలో చెవి కోల్పోయినా, మరే ఇతర కారణాల వల్లనైనా చెవి పనిచేయకపోయినా.. బాధితులకు ఆ ఇబ్బంది తెలియకుండా ఉండేలా అమెరికాలోని మసాచుసెట్స్‌ శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ చెవిని తయారు చేశారు. ఇదేమీ కేవలం అలంకారం కోసం బయటికి తగిలించే చెవి మాత్రమే కాదు. లోపల చెవి తాలూకు పని కూడా చేసేవిధంగా దీన్ని రూపొందించారు.

ఈ కృత్రిమ చెవి నిర్మాణంలో భాగంగా.. శాస్త్రవేత్తలు ఆవులోని కొలాజెన్‌ అనుసంధానక కణజాలంను.. ఒక టైటానియం తీగసాయంతో బయటి చెవిలాగా రూపొందించారు. గొర్రెలోని కార్టిలేజ్‌తో లోపలి కణాలను అభివృద్ధి చెందించారు. ఈ చెవి నిర్మాణాన్ని ఎలుకల విషయంలో ప్రయోగిస్తే సత్ఫలితలు వచ్చాయి. త్వరలో మనుషులకు సంబంధించి కూడా ప్రయోగాలు చేయవచ్చునని అంఉన్నారు.

  • Loading...

More Telugu News