: రాయలసీమ అభిమానిగా బాధపడుతున్నా: సినీ హీరో నరేష్
ప్రముఖ హాస్య నటుడు నరేష్ రాయలసీమకు మద్దతు పలికారు. తెలంగాణ ప్రకటన అభిలషణీయమే కానీ తరాలుగా దగా పడుతున్నది రాయలసీమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ బిడ్డగా, రాయలసీమ అభిమానిగా తాజా నిర్ణయంపట్ల బాధపడుతున్నానని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచి రాయలసీమ నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని జీర్ణించుకోలేక పోతున్నానని ఆయన తెలిపారు. రాయలసీమ కోసం పోరాటంలో భాగస్వామినవుతానన్నారు. సినీ హీరో నరేష్ గతంలో బీజేపీ తరపున బరిలోకి దిగారు. ఆ పార్టీలో పలు పదవులు కూడా అలంకరించారు.