: పరుగు తేడాతో దిల్షాన్ సెంచరీ మిస్
దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో విధ్వంసక ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. కొలంబో ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్ మ్యాచ్ లో దిల్షాన్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెక్ లారెన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కాగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య లంక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. దిల్షాన్ మెరుపులకు తోడు మిడిలార్డర్ కుమార్ సంగక్కర (75 నాటౌట్), తిరిమన్నే (68) రాణించడంతో లంక భారీ స్కోరు సాధించింది. కాగా, ఐదు వన్డేల సిరీస్ ను లంక ఇప్పటికే 3-1తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.