: పాకిస్థాన్ లో దావూద్ ఇబ్రహీం స్థావరాలు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం.. పాకిస్థాన్ లోని మూడు స్థావరాల నుంచి క్రికెట్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ లను నియంత్రించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో నిన్న దాఖలు చేసిన ఛార్జిషీటులో దావూద్ పేరును పొందుపరిచిన పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు. దావూద్, అతని అనుచరుడు చోటా షకీల్ భారత్ లో జరిగిన ఐపీఎల్ లో ఫిక్సింగ్ తీరుతెన్నులను నిర్ధేశించడమే కాకుండా.. బెట్టింగ్ ను కరాచీ, ఇస్లామాబాద్ లలోని రహస్య నివాసాల నుంచి పర్యవేక్షించినట్టు పేర్కొంది.
ఇందులో రెండు చిరునామాలు కరాచీలో ఉండగా, ఒకటి ఇస్లామాబాద్ లో ఉందని తెలిపింది. గత సంవత్సరం 49 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను పాక్ కు భారత్ అందించిన వాటిలో ఈ వివరాలు ఉన్నాయి. 1993 ముంబయి పేలుళ్లలో ప్రధాన నిందితుడైన దావూద్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో ఒకడన్న సంగతి తెలిసిందే.