: రిపోర్టర్ పై కస్సుమన్న సల్మాన్ ఖాన్


బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఓ మీడియా ప్రతినిధిపై చిందులు వేశాడు. మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తాజాగా రణ్ బీర్ కపూర్ తో స్పెయిన్ లో విహారయాత్ర చేసిరాగా, ఆ ఫొటోలపై కామెంట్ చేయమని సల్మాన్ ను కోరడమే ఆ రిపోర్టర్ చేసిన తప్పిదం. అడగడమే ఆలస్యం, తీవ్ర పదజాలంతో దూషించాడట ఈ కండలరాయుడు. దీంతో, ఆ రిపోర్టర్ కిమ్మనకుండా ఉండిపోయాడని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. కాగా, కత్రీనాతో అఫైర్ ముగిసిన తర్వాత సల్మాన్ రుమేనియా మోడల్ భామ ఇలియా వాంచూర్ తో జతకట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్ చిత్రాల షూటింగ్ స్పాట్లో తరచూ ఈ యూరోపియన్ ముద్దుగుమ్మ కనిపించడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య సీరియస్ రిలేషన్ ఉన్నట్టు అనిపించడంలేదూ!

  • Loading...

More Telugu News