: తుది విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం


రాష్ట్రంలో తుది విడత పంచాయతీ పోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమయింది. ఇందులో భాగంగా మొత్తం 5,939 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అనంతరం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తరువాత సర్పంచి అభ్యర్ధి ఓట్లు లెక్కిస్తారు. సాయంత్రానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News