: సీమాంధ్రుల ఆగ్రహానికి ధ్వంసమవుతున్న ప్రభుత్వ ఆస్తులు
సీమాంధ్రలో ఆగ్రహజ్వాలలు చెలరేగుతున్నాయి. తెలంగాణ ప్రకటనపై మండిపడుతున్న సమైక్యవాదులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వీదిలైట్లను విరగ్గొడుతున్నారు. బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలపై రాళ్ల దాడులు చేస్తున్నారు. తమ ఆమోదం లేకుండా ఎలా రాష్ట్రాన్ని విడదీస్తారని మండిపడుతున్నారు. రాయసీమ జిల్లాల్లో ఈ దాడులు మరింత తీవ్రంగా ఉన్నాయని సమాచారం. రేపటికల్లా కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే తమ ఆగ్రహానికి గురికాక తప్పదని సీమాంధ్ర సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు.