: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు షాక్.. ప్రజలకు ముఖం ఎలా చూపించాలి?
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు యూపీఏ ప్రకటన శరాఘాతంలా పరిణమించింది. ఉదయం నుంచీ అధిష్ఠానం చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రకటనను విన్నాక ఏ మూలో ఆశ ఉన్న నేతలంతా మీడియాకు కూడా దొరకకుండా ఎవరికి వారుగా మిన్నకుండి పోయారు. నిన్నటి వరకూ ఉత్సాహంగా ఉన్న నేతలు ప్రజలకు ముఖం చాటేశారు. తమ ప్రాంతంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలీని డోలాయమాన పరిస్థితిలో పడిపోయారు. కేంద్ర మంత్రులుగా పదవులు వెలగబెడుతున్న సీమాంధ్ర నేతలు రేపటి నుంచి తమ ప్రాంతంలో ఏ రకమైన ప్రతిఘటన ఎదుర్కోవాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, ఈ పరిణామాలతో వారి రాజకీయ జీవితం సజీవంగా ఉండాలంటే, సీమాంధ్రలోని రాజకీయ పార్టీల నేతలంతా కలుగుల్లోని ఎలుకల్లా రాజీనామాస్త్రాలు సంధించాల్సిందేనని అక్కడి ప్రజలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.