: రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి మాకు ఇంకా అవకాశముంది: లగడపాటి
"కేంద్రం నిర్ణయం మమ్మల్ని షాక్ కు గురిచేసింది. శ్రీకృష్ణ కమిటీ ఒక సొల్యూషన్ ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల సాదించిందేంటి? కాంగ్రెస్ ప్రకటన రాష్ట్రంలో ఎక్కువ మందిని నిరాశకు గురిచేసింది" అన్నారు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్. వాస్తవాలను మరోసారి అధిష్ఠానం ద్రుష్టికి తీసుకెళ్తామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించాలి, ఇప్పడు కాంగ్రెస్ పార్టీ చేసిందదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని, అప్పుడు వాళ్లే తేలుస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబుకు చెప్పినా ఆయన స్పందించలేదని లగడపాటి మండిపడ్డారు. 'ఇప్పుడు చెప్పింది కేవలం కాంగ్రెస్ అభిప్రాయమే. మాకు ఇంకా అవకాశముందని భావిస్తున్నామ'ని లగడపాటి తెలిపారు. అసెంబ్లీ తీర్మానంలో అడ్డుకుంటామని, అక్కడ ఆగకపోతే పార్లమెంటులో అడ్డుకుని తీరుతామని లగడపాటి రాజగోపాల్ శపథం చేశారు.