: అమరవీరులకు ఈ ప్రకటన అంకితం: జానా
తెలంగాణ ప్రకటనపై మంత్రి జానా రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 56 ఏళ్ళ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు జరిగాయని, ప్రత్యేక రాష్ట్రం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలని పేర్కొన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలకూ ధన్యవాదాలు తెలిపారు. సీమాంధ్ర నేతలు సహకరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.