: హైదరాబాదులో అందరం కలిసే బతుకుదాం: నాగం
రాష్ట్రం విడిపోయినా హైదరాబాదులో అందరం కలిసే బతుకుదామని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి అన్నారు. అన్నదమ్ములుగా విడిపోదామని సీమాంధ్ర నాయకులకు aఅయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాగం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాదుతో కూడిన 10 జిల్లాల తెలంగాణనే తాము కోరుతున్నట్లు స్పష్టీకరించారు.