: ముందుంది సంబరాల కాలం: నాయిని నర్సింహారెడ్డి
తెలంగాణపై ప్రకటన చేయగానే అంతా అయిపోయినట్టు కాదని, పార్లమెంటులో తీర్మానం చేసినప్పుడే సంబరాలు చేసుకుంటామని టీఆర్ఎస్ నేత నాయిని నర్శింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రకటన అందరూ ఊహించినదేనని, అయితే అది హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రమా? లేక ఇంకేవైనా మార్పుచేర్పులు ఉంటాయా? అన్నది చూడాలని నాయిని అన్నారు. మరి కొద్ది రోజుల్లో సంబరాలు చేసుకుంటామని, తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.