: ఘటనలో అధికారుల నిర్లక్ష్యం లేదు: బొత్స
దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల ఘటనలో అధికారుల నిర్లక్ష్యం ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఘటన జరిగిన వెంటనే వారు స్పందించారని బొత్స వెనకేసుకొచ్చారు. హైదరాబాదు గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, జరిగిన సంఘటనను రాజకీయం చేయవద్దన్నారు.
ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే ఘటనకు సంబంధించి రెండు రోజుల ముందే కేంద్రం నుంచి హెచ్చరికలు వచ్చిన విషయంపై సీఎం ముందుగానే జవాబు ఇచ్చారంటూ బొత్స దాటవేశారు.