: సీడబ్ల్యూసీ సంప్రదాయం... తెలంగాణ ఏర్పాటు ప్రకటన లాంఛనమే: అజిత్ సింగ్
తెలంగాణ ఏర్పాటుపై యూపీఏ మిత్రపక్షాలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయని ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ తెలిపారు. దీంతో పూర్తిగా తమ పార్టీ అంతర్గత సమావేశమైన సీడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ ప్రకటపై చర్చించేది పెద్దగా ఏమీ లేదన్నది సుస్పష్టం. దీంతో సీడబ్ల్యూసీ భేటీ అనేది ఓ లాంఛనం తప్ప దాన్లో చర్చించేది ఏదీ ఉండదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కాకుంటే అది ఓ సంప్రదాయం. అంతేకానీ, అది పెద్ద చర్చావేదిక కాదని చెబుతున్నారు.