: శాశ్వత అంగవైకల్యం కలిగితే మృతులతో సమానంగా పరిహారం


జంట పేలుళ్లలో మృతి చెందిన వారికి రాష్ట్ర మంత్రివర్గం సంతాపాన్ని తెలియజేసింది. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో నిన్నటి పేలుళ్లపై చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి డీకే అరుణ మీడియాకు తెలిపారు.

పేలుళ్ల వల్ల శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి మృతులతో సమానంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. గాయాలపాలైన వారి చికిత్సా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.  పేలుళ్లలో మరణించిన వారికి ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News