: ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 కోట్లు తీసుకుంటున్న సల్మాన్!


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భారీ డీల్ పై సంతకం చేశాడు. త్వరలో ప్రసారంకానున్న పాప్యులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్-7' కు సల్మాన్ హోస్టుగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఒక్కో ఎపిసోడ్ కు సల్మాన్ రూ.5 కోట్టు తీసుకుంటున్నాడని, ఒప్పందంపై సంతకం కూడా చేశాడని ఫిల్మ్ వర్గాల సమాచారం. 26 ఎపిసోడ్ లలో కనిపించనున్న సల్లూభాయ్ కు రూ.130 కోట్ల భారీ మొత్తం రానుంది. ఇప్పటికే చిత్రీకరించిన ఈ షో ప్రమోషన్ వీడియోలో సల్మాన్ డబుల్ రోల్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 2010 నుంచి బిగ్ బాస్ షోకు సల్మాన్ హోస్టుగా ఉంటూ ప్రేక్షకుల్లో వీపరీతమైన క్రేజ్ తీసుకొచ్చాడు.

  • Loading...

More Telugu News