: ప్రజలకు నచ్చజెప్పుకోండి: సీమాంధ్రనేతలతో సోనియా
ఈ ఉదయం సీమాంధ్రనేతలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలవగా, ఆమె వారికి కర్తవ్యబోధ చేశారు. తాము తీసుకునే నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలకు నచ్చజెప్పుకునే బాధ్యత నేతలదే అని వారికి స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ ప్రజల మనోభావాలనూ పరిగణనలోకి తీసుకోవాలని మేడమ్ సీమాంధ్ర నేతలకు సూచించారు. కాగా, వ్యతిరేక నిర్ణయం వస్తే సీమాంధ్రలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని నేతలు సోనియాకు వివరించారు.