: ఐదు వికెట్లు తీసిన అశ్విన్, కష్టాల్లో ఆసీస్
భారత్ తో తొలిటెస్టులో ఆస్ట్రేలియా జట్టు కష్టాల్లో పడింది. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ సొంతగడ్డపై చెలరేగడంతో డ్రింక్స్ సమయానికి ఆసీస్ 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ అశ్విన్ తీసినవే కావడం విశేషం. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ కెప్టెన్ క్లార్క్ (21), యువ ఆల్ రౌండర్ మోజెస్ హెన్రిక్స్ (4) ఉన్నారు.