: సోనియాతో ముగిసిన సీమాంధ్ర మంత్రుల భేటీ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సీమాంధ్ర మంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీకి ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు కేంద్రమంత్రులు, ముగ్గురు ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించవద్దని వారు అధినేత్రిని కోరారు. దానితో పాటు పదవులు ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. వీరి వాదనను ఓపికగా విన్న సోనియా గాంధీ.. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయమే తీసుకున్నామని తెలిపినట్టు సమాచారం.