: గుంటూరు జిల్లా ఆరు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా


ఈ నెల 31న జరగనున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గుంటూరు జిల్లా ఆరు పంచాయతీల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యానే వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ సురేష్ తెలిపారు. ఆగస్టు ఆరున ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రొంపిచర్ల, ముక్తాన్ పల్లి, నాదెండ్ల మండలం, తూబాడు తదితర పంచాయతీల్లో ఎన్నికలు వాయిదాపడ్డాయి.

  • Loading...

More Telugu News