: రగులుతున్న సీమాంధ్ర
రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సీమాంధ్ర ప్రాంతంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నేడు తిరుపతిలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక విజయవాడలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజమండ్రిలో న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో మానవహారం నిర్వహించారు.