: సోనియాను కలిసిన కేంద్ర మంత్రులు
రాష్ట్రాన్ని విభజించవద్దంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కలిసి మరోమారు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన సంగతి తెలిసిందే. కాగా, సాయంత్రం కీలక సమావేశాలున్న నేపథ్యంలో సోనియా.. సీనియర్ వ్యూహకర్తలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, చిదంబరం, గులాంనబీ ఆజాద్ తదితరులతో మంతనాలు జరిపారు.